మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Raghava Stotram – శ్రీ రాఘవ స్తోత్రం


ఇంద్రనీలాచలశ్యామమిందీవరదృగుజ్జ్వలమ్ |
ఇంద్రాదిదైవతైః సేవ్యమీడే రాఘవనందనమ్ || 1 ||

పాలితాఖిలదేవౌఘం పద్మగర్భం సనాతనమ్ |
పీనవక్షఃస్థలం వందే పూర్ణం రాఘవనందనమ్ || 2 ||

దశగ్రీవరిపుం భద్రం దావతుల్యం సురద్విషామ్ |
దండకామునిముఖ్యానాం దత్తాభయముపాస్మహే || 3 ||

కస్తూరీతిలకాభాసం కర్పూరనికరాకృతిమ్ |
కాతరీకృతదైత్యౌఘం కలయే రఘునందనమ్ || 4 ||

ఖరదూషణహంతారం ఖరవీర్యభుజోజ్జ్వలమ్ |
ఖరకోదండహస్తం చ ఖస్వరూపముపాస్మహే || 5 ||

గజవిక్రాంతగమనం గజార్తిహరతేజసమ్ |
గంభీరసత్త్వమైక్ష్వాకం గచ్ఛామి శరణం సదా || 6 ||

ఘనరాజిలసద్దేహం ఘనపీతాంబరోజ్జ్వలమ్ |
ఘూత్కారద్రుతరక్షౌఘం ప్రపద్యే రఘునందనమ్ || 7 ||

చలపీతాంబరాభాసం చలత్కింకిణిభూషితమ్ |
చంద్రబింబముఖం వందే చతురం రఘునందనమ్ || 8 ||

సుస్మితాంచితవక్త్రాబ్జం సునూపురపదద్వయమ్ |
సుదీర్ఘబాహుయుగలం సునాభిం రాఘవం భజే || 9 ||

హసితాంచితనేత్రాబ్జం హతాఖిలసురద్విషమ్ |
హరిం రవికులోద్భూతం హాటకాలంకృతం భజే || 10 ||

రవికోటినిభం శాంతం రాఘవాణామలంకృతిమ్ |
రక్షోగణయుగాంతాగ్నిం రామచంద్రముపాస్మహే || 11 ||

లక్ష్మీసమాశ్రితోరస్కం లావణ్యమధురాకృతిమ్ |
లసదిందీవరశ్యామం లక్ష్మణాగ్రజమాశ్రయే || 12 ||

వాలిప్రమథనాకారం వాలిసూనుసహాయినమ్ |
వరపీతాంబరాభాసం వందే రాఘవభూషణమ్ || 13 ||

శమితాఖిలపాపౌఘం శాంత్యాదిగుణవారిధిమ్ |
శతపత్రదృశం వందే శుభం దశరథాత్మజమ్ || 14 ||

కుందకుడ్మలదంతాభం కుంకుమాంకితవక్షసమ్ |
కుసుంభవస్త్రసంవీతం పుత్రం రాఘవమాశ్రయే || 15 ||

మల్లికామాలతీజాతిమాధవీపుష్పశోభితమ్ |
మహనీయమహం వందే మహతాం కీర్తివర్ధనమ్ || 16 ||

ఇదం యో రాఘవస్తోత్రం నరః పఠతి భక్తిమాన్ |
ముక్తః సంసృతిబంధాద్ధి స యాతి పరమం పదమ్ || 17 ||

ఇతి శ్రీ రాఘవ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.